కాలిఫోర్నియాలో గొరిల్లాలకు కరోనా పాజిటివ్

Gorillas at San Diego zoo test positive for Covid-19

అమెరికాలో మొట్టమొదటిసారిగా గొరిల్లాలకు కూడా కరోనా సోకింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాండియాగోలో ఉన్న ఓ జూ సఫారి పార్క్‌లో పదుల సంఖ్యలో గొరిల్లాలకు కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు వెంటనే పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో గొరిల్లాలకు కరోనా పాజిటివ్‌ అని వచ్చింది. జూ సిబ్బందిలోని ఓ వ్యక్తి ద్వారానే గొరిల్లాలకు కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. సదరు వ్యక్తి గొరిల్లాల వద్దకు వెళ్లిన ప్రతిసారి మాస్క్‌ ధరించాడని, అయినప్పటికి  కరోనా సోకిందని తెలిపారు. కరోనా పరీక్షల్లో ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో అధికారులు అతడి ద్వారానే కరోనా సోకినట్టు నిర్ధారించారు. ఇప్పటివరకు గొరిల్లాలకు ఎటువంటి వైద్యం అందించలేదని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు.