ఆమెకు మరణశిక్ష.. స్టే ఇచ్చిన అమెరికా కోర్టు

Lisa Montgomery US judge grants another stay of execution

అమెరికాకు చెందిన లీసా మాంట్‌గోమోరి అనే మహిళకు ఇవాళ (12వ తేదీ) మరణశిక్ష అమలు చేయాల్సి ఉంది. ఇండియానా జైలులో ఆమెకు విషపూరిత ఇంజక్షన్‌ ఇచ్చి శిక్షను అమలు చేయాలి. కానీ అమెరికా కోర్టు ఆమె మరణంపై 24 గంటల స్టే విధించింది. 2004లో  ఓ గర్భిణిని చంపి.. ఆమె కడపులో ఉన్న శిశువుతో లీసా పరారైంది. ఆ కేసులో దోషిగా తేలిన లీసాకు మరణశిక్ష ఖరారైంది. లీసా మానసిక ఆరోగ్యం సరిగా లేదని జడ్జి ప్యాట్రిక్‌ హన్లాన్‌ మరణ శిక్ష అమలును నిలిపివేశారు. గత 67 ఏళ్లలో ఓ మహిళకు ఖరారైన మరణశిక్షను ఆడ్డుకోవడం ఇదే తొలిసారి. హత్యకు గురైన గర్భిణికి పుట్టిన అమ్మాయి వయసు ఇప్పుడు 16 ఏళ్లు. విక్టోరియా జో అనే ఆ అమ్మాయి.. లీసా మరణశిక్ష అంశంపై ఎటువంటి స్పందన ఇవ్వలేదు.