పవన్ కళ్యాణ్ బ్యానర్ లో వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం?

vaishnav tej third film in pawan kalyan banner

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రొడక్షన్ వైపు మరో సారి  అడుగులు వేయబోతున్నాడు. నటుడిగా బిజీగా ఉన్న పవర్ స్టార్ నెక్స్ట్ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల క్రిష్ సినిమాను కూడా లైన్ లో పెట్టాల్సి వచ్చింది. మరోవైపు అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే పవర్ స్టార్ ఒక యువ హీరోతో సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ హీరో మరెవరో కాదు. ఆయన మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఇప్పటికే ఉప్పెన సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసిన వైష్ణవ్ అలాగే క్రిష్ డైరెక్షన్ లో కూడా మరో సినిమాను చేస్తున్నాడు. మొదటి సినిమా  విడుదల కాకముందే వరుసగా మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాలని అనుకుంటున్నాడు. 

ఇక పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ లో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. 2017 లో పవన్ కళ్యాణ్ తమిళ్ వీరం రీమేక్ గా వచ్చిన కాటమరాయుడు చిత్రానికి దర్శకత్వం వహించిన   డైరెక్టర్ కిషోర్ పార్థసాని (డాలీ) చెప్పిన ఒక కథ నచ్చడంతో పవన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆ కథ వైష్ణవ్ తేజ్ కు కరెక్ట్ గా సెట్టవుతుందని వీలైనంత త్వరగా సినిమాను స్టార్ట్ చేయమని చెప్పాడట. కాటమరాయుడు తర్వాత  నితిన్ తో చల్ మోహన్ రంగా సినిమా చేసిన విషయం తెలిసిందే. కానీ ఆ రెండు సినిమాలు కూడా  అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ అవ్వలేదు. మరి ఇప్పుడు వైష్ణవ్ తేజ్ ఏ రేంజ్ హీరోని చేస్తాడో వేచి చూద్దాం.