
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను శాశ్వతంగా తొలగించిన సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ట్రంప్‌పై నిషేధం ప్రకటించిన తరువాత ట్విటర్ షేర్ 12 శాతం కుప్పకూలింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5 బిలియన్ డాలర్లు ఆవిరై పోయింది. మరోవైపు ఇప్పటికే ట్రంప్ అధికారిక ట్విటర్ ఖాతాను బ్లాక్ చేసిన సంస్థ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రంప్ మద్దతుదారులకు చెందిన సుమారు 70 వేల అకౌంట్లను నిలిపి వేసింది. సుమారు ట్విటర్లో 88 మిలియన్ల మంది ఫాలోవర్స ట్రంప్ సొంతం.