పెళ్లి సందడి కి పాతికేళ్లు ...

Pelli Sandadi Completes 25 Years

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన సినీ అణిముత్యాల్లో ఒకటి పెళ్లి సందడి చిత్రం. నటుడు శ్రీకాంత్‌ కెరీర్‌లోనూ అల్‌టైమ్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా ఆ చిత్రం విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దర్శకేంద్రుడు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్‌ చేశారు. నేటికి పెళ్లి సందడి సినిమా విడుదలై 25 ఏళ్లు. నా కెరీర్‌, శ్రీకాంత్‌ కెరీర్‌లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయేలా చేసిన ప్రేక్షకాభిమానులకు, కీరవాణికి, చిత్ర నిర్మాతలు అశ్వనీదత్‌, అల్లు అరవింద్‌,  జగదీష్‌ ప్రసాద్‌లను నమస్కరిస్తున్నాను అంటూ రాసుకొచ్చారు. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రంలోని ప్రతి పాట సెన్షేషన్‌. కీరవాణి అందించిన స్వరాలు సంగీత ప్రియులను ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా సౌందర్య లహరీ, మా పెరటి జాంచెట్టు పాటలు ఇప్పటికీ అలరిస్తున్నాయి. హీరోయిన్లు దీప్తి భట్నాగర్‌ అందాలు, రవళి అమాయకపు చూపులు సినిమాకు మరింత ఆకర్షణీయంగా నిలిచాయి.