మరో ఘనతను సాధించిన టీసీఎస్

TCS records best ever Q3 in 9 years despite pandemic

ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ చరిత్ర సృష్టించింది. టాటా కన్సెల్టెన్నీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) షేర్‌ ధర 3.5 శాతం పెరిగి గరిష్ట స్థాయి 3,230 రూపాయలను తాకింది. దీంతో తొలిసారిగా టీసీఎస్‌ మార్కెట్‌ క్యాప్‌ 12 లక్షల కోట్ల రూపాయలను దాటి మరో ఘనతను తన పేరున లిఖించుకుంది. ఇంతముందు ఈ ఘనతను రిలయన్స్‌ ఇండిస్ట్రీస్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎల్‌) సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాల ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉన్నాయి. జూలై- సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.7,504 కోట్లతో పోలిస్తే కంపెనీ నికర లాభం సంవత్సరానికి 7.17 శాతం పెరిగి రూ.8,727 కోట్లకు చేరుకుంది.     

ట్రేడింగ్‌ సమయంలో టీసీఎస్‌ షేర్లు 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి. దీంతో తొలిసారిగా టీసీఎస్‌ కంపెనీ క్యాపిటలైజెషన్‌ వాల్యూ 12 లక్షల కోట్ల రూపాయలను దాటింది. దేశంలో 12 లక్షల కోట్ల క్యాపిటలైజెషన్‌ దాటిన రెండో కంపెనీగా టీసీఎస్‌ నిలిచింది. అలాగే, ప్రస్తుతం ఇన్ఫోసిస్‌ ఒక్కో షేరు ధర రూ.1,365.95, హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ రూ.1,029, విప్రో రూ.444.95, మైండ్‌ట్రీ రూ.1,764.50, టెక్‌ మహీంద్రా రూ.1,068.65 వద్ద ట్రెడ్‌ అవుతున్నాయి. గ్లోబల్‌ మార్కెట్‌లో పెరుగుదల కారణంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో వృద్ధి కనిపించినట్లు నిపుణులు పేర్కొన్నారు.

 


                    Advertise with us !!!