సునీల్ కు జోడీగా అనసూయ?

Anasuya To Romance Sunil

కమెడియన్‍, హీరో, నెగెటివ్‍ షేడ్స్ ఉన్న పాత్రలు ఇలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల టాలెంట్‍ కలిగిన నటుడు సునీల్‍. ఇటీవలే కలర్‍ఫోటోతో ఓటీటీ ప్లాట్‍ఫాం ద్వారా అందరినీ పలుకరించాడు సునీల్‍. ఈ సినిమా సునీల్‍ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. కలర్‍ఫొటో సక్సెస్‍ తో పుల్‍ జోష్‍ మీదున్న సునీల్‍ హీరోగా ఓ చిత్రానికి గ్రీన్‍సిగ్నల్‍ ఇచ్చారు. వేదాంతం రాఘవయ్య టైటిల్‍ లాంఛింగ్‍ కార్యక్రమం జరిగింది. హరీశ్‍ శంకర్‍ ఈ చిత్రానికి కథనందిస్తుండగా, 14 రీల్స్ ప్లస్‍ బ్యానర్‍ సమర్పిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో సునీల్‍ సరసన టాలీవుడ్‍ బ్యూటీ అనసూయ భరద్వాజ్‍ హీరోయిన్‍ గా నటిస్తున్నట్టు టాక్‍. డైరెక్టర్‍ సీ.చంద్రమోహన్‍ అనసూయకు ఇప్పటికే కథ వినిపించగా ఆమె గ్రీన్‍ సిగ్నల్‍ కోసం వెయిట్‍ చేస్తున్నాడట. సాయికార్తీక్‍ ఈ చిత్రానికి మ్యూజిక్‍ డైరెక్టర్‍. రాం ఆచంట, గోపీచంద్‍ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రెగ్యులర్‍ షూటింగ్‍ త్వరలోనే ప్రారంభం కానుంది.