హైదరాబాద్ కు మరో భారీ పెట్టుబడి

Massmutual is setting up their Global Capability Center in Hyderabad

తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెజాన్‍, గూగుల్‍, ఫేస్‍బుక్‍, ఆపిల్‍, ఫియట్‍ క్రిస్లర్‍ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కంపెనీల సరసన మరో అంతర్జాతీయ కంపెనీ చేరింది. తాజాగా హైదరాబాద్‍లో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. నగరంలో గ్లోబల్‍ కేపబలిటీ సెంటర్‍ను ఏర్పాటు చేస్తున్నట్లు అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్సూరెన్స్ దిగ్గజం మాస్‍ మ్యూచువల్‍ సంస్థ ప్రకటించింది. అమెరికా వెలుపల రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. మాస్‍ మ్యూచువల్‍ కంపెనీ హైదరాబాద్‍లో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించడంతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి హర్షం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా కేటీఆర్‍ ట్వీట్‍ చేశారు. ఈ వారినికి ఇంతకు మించిన శుభారంభం ఏముంటుంది? టాప్‍ ఫార్చున్‍ 500 కంపెనీల్లో ఒకటైన మాస్‍ మ్యూచువల్‍ను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‍ అన్నారు.

 


                    Advertise with us !!!