
నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) ఆధ్వర్యం లో వాషింగ్టన్ స్టేట్ లో సియాటెల్ నగరం లో డిసెంబర్ మాసం లో ఫుడ్ డ్రైవ్ నిర్వహించి ఆకలితో ఉన్న పలువురి ఆకలి తీర్చే స్థానిక ఫుడ్ పాంట్రీ కు ఇవ్వడం జరిగింది. నాటా సియాటెల్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్లు, రీజినల్ కోఆర్డినేటర్లు, అందరినీ సమన్వయం చేసుకొని, పలువురు నాటా సభ్యుల సహకారం తో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమం నిర్వహించి సహాయాన్ని అందించిన నాటా కార్యవర్గ సభ్యులను ఫుడ్ పాంట్రీ నిర్వాహకులు అభినందించారు.