అంగరంగ వైభవంగా లాటా సంక్రాంతి మహోత్సవం - జనవరి 16

LATA Sankranti Celebrations on Jan 16

అమెరికా లో ఎక్కడా జరగని విధంగా అతి ప్రతిష్టాత్మకంగా లాటా మన సంక్రాంతి ఉత్సవాలని జరుపుకుంటుంది. లాటా సంక్రాంతి మేళా అంటే పల్లెటూరు వాతావరణాన్ని మరిపించే విధంగా పిల్లలు పెద్దలు కలిసి చేసుకునే ఉత్సవం. అరిసెలు, గారెలు, బూరెలు మొదలగు పిండి వంటలతో అరిటాకులో పంక్తి భోజనం వడ్డన జరుగుతుంది ప్రతీ ఏడూ ఎవరూ ఊహించని  విధంగా కొత్త కొత్త కార్యక్రమాలని మీ ముందుకు తీసుకు వస్తుంది లాటా.

క్రిందటి సంవత్సరం సంక్రాంతి మేళ కనీ  వినీ ఎరుగని ఒక చారిత్రాత్మకంగా జరిగింది. కరోనా మహమ్మారి వలన మన జీవన విధానాన్ని మార్చుకున్నాము. ఇది గుర్తించిన లాటామార్చి 2020 లోనే online eventsకి మొట్టమొదటి సారిగా నాంది పలికింది. అందరి ఆరోగ్యం, భద్రతని దృష్టిలో ఉంచుకొని, ఈ సంవత్సరం సంక్రాంతిని LIVE స్ట్రీమింగ్ చెయ్యటానికి నిర్ణయించాము.

ఈ సంవత్సరం సంక్రాంతి ఒక కొత్త పంథాలో, "Global Event" గా నిర్వహిస్తున్నాము. మన లాస్ ఏంజెలెస్ స్థానిక ప్రతిభ మాత్రమే కాకుండా, టాలీవుడ్ సంగీతకారులు, లిప్సికా, ఆదిత్య అయ్యింగర్, జబర్దస్త్ "హైపర్ ఆది" బృందంతో పాటుగా అధిరే అభి యాంకరింగ్ అదరగొట్టడానికి వస్తున్నారు. ఇంకా ఎన్నో మరెన్నో విశేషాలు ఉంటాయి. అన్ని ఇప్పుడే చెప్పేస్తే ఎలా?

LATA
Sankranthi Sambaralu
January 16th
6:30 PM onwards

 


                    Advertise with us !!!