
అక్టోబర్ నెలలో తానా ఆధ్వర్యంలో అంతర్జాలంలో నిర్వహించిన బంగారు బతుకమ్మ-2020 కార్యక్రమంలో క్యాన్సర్ బాధితులను ఆదుకునేందుకు ఇచ్చిన హామీలో భాగంగా సోమవారం నాడు హైదరాబాద్‌కు చెందిన క్యాన్సర్ రోగులకు లక్ష రూపాయిలను అందజేసినట్లు తానా మహిళా సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్త తూనుగుంట్ల శిరీష ఓ ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే సీతక్క, తాళ్లూరి శ్రీధర్, మిట్టపల్లి సురేశ్, యలవర్తి శ్రీని, సామినేని రవి, వాసిరెడ్డి వంశీ, పంత్ర సునీల్‌లు ఈ మొత్తాన్ని అందజేసేందుకు తోడ్పడినట్లు ఆమె తెలిపారు. తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి, తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, తానా కార్యదర్శి రవి పొట్లూరి, తానా ఉమెన్స్ ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ లక్ష్మీ దేవినేని, తానా కల్చరల్ కో ఆర్డినేటర్ సునీల్ పాంత్రా తదితరుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు శిరీష పేర్కొన్నారు.