విరాళాలు ఇవ్వడంలోనూ బెజోస్ అగ్రస్థానమే ...

World s richest man Jeff Bezos made biggest charitable donation in 2020

సంపదను కూడబెట్టడమే కాదు.. విరాళాలు ఇవ్వడంలోనూ అగ్రస్థానమేనని నిరూపించుకున్నారు అమెజాన్‍ సీఈఓ జెఫ్‍ బెజోస్‍. ప్రపంచంంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న బెజోస్‍ 2020లో 10 బిలియన్‍ డాలర్ల భారీ మొత్తాన్ని స్వచ్ఛంద కార్యక్రమాలకు వెచ్చించారు. ఈ వితరణలతో ది క్రానికల్‍ ఆఫ్‍ ఫిలాంత్రపీ వార్షిక జాబితాలో ముందు వరసలో నిలిచారు. వాతావరణ మార్పులపై పోరాటానికి ఉద్దేశించి ఈ విరాళాలను అందజేశారు.

ఫోర్బస్ అంచనాల ప్రకారం అమెజాన్‍ వ్యవస్థాపకుడి సంపద 188 బిలియన్‍ డాలర్లుగా ఉంది. ఎర్త్ ఫండ్‍ పేరిట ఆయన అందిస్తోన్న సహకారం వాతావరణ సంక్షోభంలో చిక్కుకున్న లాభాపేక్షలేని సంస్థలకు మద్దతు ఇస్తోంది. ఎర్త్ ఫండ్‍ ద్వారా ఆయన ఇప్పటివరకు 16 గ్రూపులకు 790 మిలియన్‍ డాలర్ల సహకారం అందించారని క్రానికల్‍ వెల్లడించింది. అయితే, ఆయన కాకుండా మిగతా టాప్‍ టెన్‍ వితరణలు 2011తో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొంది. ఈ మొత్తం 2.6 బిలియన్‍ డాలర్లుగా మాత్రమే ఉందని తెలిపింది. ఆ బిలియనీర్ల సంపద గత సంవత్సరం భారీగా పెరిగినపన్పటికీ విరాళాల మొత్తం మాత్రం తగ్గినట్లు తెలిపింది.