కరోనా వ్యాక్సిన్ పై అవగాహన కల్పించిన నాట్స్

NATS Community Awareness Program on COVID 19 Vaccine

వెబినార్ ద్వారా సందేహాలు తీర్చిన డామహేశ్ కొత్తపల్లి

కరోనాకు చెక్ పెట్టేందుకు కీలకమైన కరోనా వ్యాక్సిన్ పై నాట్స్ అవగాహన కల్పించేందుకు వెబినార్ నిర్వహించింది. డాలస్‌లో ప్రముఖ తెలుగు వైద్యులు డా. మహేశ్ కొత్తపల్లి ఈ వెబినార్‌లో వ్యాక్సిన్ ప్రాముఖ్యతపై చక్కగా వివరించారు.  డా. మహేశ్  కొత్తపల్లి  అంటువ్యాధుల నిపుణులు కావడంతో వ్యాక్సిన్‌తో ఎలా అంటువ్యాధులకు చెక్ పెట్టవచ్చనేది తెలిపారు. ముఖ్యంగా కరోనా విషయంలో ఎవరూ అశ్రద్ధగా ఉండొద్దని హెచ్చరించారు. తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పారు. అక్కడక్కడ వ్యాక్సిన్ వల్ల వస్తున్న చిన్న చిన్న ఆరోగ్య ఇబ్బందులు తాత్కలికమైనవేనన్నారు. నిర్భయంగా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని మహేశ్ సూచించారు. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్న వైద్యులు, మధు కొర్రపాటి, రాజేంద్ర అప్పలనేని, వంశీ సింగిరికొండ తమ అనుభవాలను వివరించారు. వందల మంది ఈ వెబినార్ ద్వారా అనుసంధానమై కరోనా వ్యాక్సిన్ పై ఓ అవగాహనకు వచ్చారు. కొంతమంది సందేహాలను వైద్యులు మహేశ్‌ను అడిగి నివృత్తి చేసుకున్నారు.

నాట్స్ బోర్డ్ డైరెక్టర్ ఆది గెల్లి ఈ వెబినార్‌కు వ్యాఖ్యతగా వ్యవహరించారు. నాట్స్ ప్రెసిడెంట్  విజయ్ శేఖర్ అన్నే నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలు, హెల్ప్ లైన్ గురించి వివరించారు. నాట్స్ డాలస్ చాప్టర్ కో ఆర్డినేటర్ రాజేంద్ర కాట్రగడ్డ, నాట్స్ డాలస్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ రాజేంద్ర యనమదలతో నాట్స్ డాలస్ టీం ఈ వెబినార్ విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఇంత చక్కటి వెబినార్ నిర్వహించినందుకు నాట్స్ డాలస్ టీంను నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని అభినందించారు.

 


                    Advertise with us !!!