వైభవంగా జరిగిన నందమూరి జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ వివాహం

nandamuri chaitanya krishna marriage

దివంగత ముఖ్య మంత్రి మహా నటుడు ఎన్టీఆర్ పెద్దకుమారుడు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ వివాహం బంధువుల అమ్మాయి రేఖావాణితో మంగళవారం ఘనంగా జరిగింది. 2020లో కరోనా కారణంగా ప్రజలందరూ ఇబ్బంది పెట్టినా కొందరు సెలబ్రెటీలకు మాత్రం మరుపురాని ఏడాదిగా నిలిచిపోయింది. ఎప్పటి నుంచో బ్యాచిలర్లుగా గడిపేస్తున్న చాలామంది తారలు ఈ ఏడాదే పెళ్లి పీటలెక్కారు. తాజాగా నందమూరి కుటుంబంలోనూ పెళ్లి సందడి నెలకొంది. నందమూరి తారక రామారావు పెద్ద కొడుకు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ వివాహం మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. దగ్గరి బంధువైన రేఖవాణి అనే యువతినే ఆయన పెళ్లి చేసుకున్నారు.

ఈ వేడుకకు నందమూరి కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. నందమూరి బాలకృష్ణ దంపతులు, వారి తనయుడు మోక్షజ్ఞ పెళ్లి వేడుకలో ప్రత్యేకాకర్షణగా కనిపించారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. నందమూరి వంశంలో  అగ్ర హీరోలు ఎవరంటే ముందుగా గుర్తొచ్చేది బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఎన్టీఆర్ తన స్థాయిని పాన్ ఇండియా వరకు తెచ్చుకొని తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు, అయితే తన స్థాయి ఎంత పెంచుకున్నా కూడా నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్ కు కొంత డిస్టెన్స్  ఉందన్నది మాత్రం వాస్తవం. కళ్యాణ్ రామ్ తమ్ముడిని ఎంత ఇష్టపడిన కూడా మిగతా వారు మాత్రం పెద్దగా స్పందించరని తెలిసిందే. ఇక చాలా రోజుల తరువాత నందమూరి వారి ఇంట్లో ఒక శుభకార్యం జరుగగా ఎన్టీఆర్ రాకపోవడంతో ఒక్కసారిగా న్యూస్ వైరల్ గా మారింది. 

సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ తనయుడు చైతన్య కృష్ణ వివాహం ఇటీవల ప్రయివేట్ ఫంక్షన్ గా జరిగింది. వేడుకకు నందమూరి బ్రదర్స్ అందరు పాల్గొన్నారు. అలాగే కళ్యాణ్ రామ్ కూడా సతి సమేతంగా పెళ్లికి వచ్చాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడంతో కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ ను పిలవలేదా లేకపోతే రాలేదా అనే అనుమానాలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే రాకపోవటానికి మరొక కారణం కూడా ఉండి ఉండవచ్చు. ఆర్ ఆర్ ఆర్  సినిమా కీలక షెడ్యూల్ లో పాల్గొంటున్న కారణంగా లుక్ బయటపడకూడదనే కారణం చేత కూడా రాకపోయి ఉండవచ్చని టాక్ వస్తోంది. మరి ఈ రూమర్స్ ఎంత వరకు నిజమో తెలియదు గాని నందమూరి బ్రదర్స్ అందరు కలిసి ఒక ఫ్రేమ్ లో కనిపిస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.