
ఐఫోన్ మేకర్ ఆపిల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. 2024 నాటికి ప్యాసెంజర్ వెహికిల్‌ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో గతంలో ఎన్నడూ లేని బ్యాటరీ టెక్నాలజీ వాడనున్నట్లు వెల్లడించింది. దీనికి ప్రాజెక్ట్ టైటాన్ అనే పేరు కూడా పెట్టారు. నిజానికి తొలిసారి 2014లో సొంతంగా వెహికిల్ తయారీపై ఆపిల్ దృష్టి సారించింది. అంతకుముందు యాపిల్‌లో పని చేసి టెస్లాకు వెళ్లిన సీనియర్ ఉద్యోగి డాగ్ ఫీల్డ్‌ను 2018లో మళ్లీ వెనక్కి రప్పించింది ఆపిల్. అయితే 2019లో ఈ టీమ్ నుంచి 190 మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పటికే ఆపిల్ ప్రత్యర్థులైన ఆల్ఫాబెట్ ఐఎన్‌సీ వేమో పేరుతో రోబో ట్యాక్సీలను తయారు చేసింది. బ్యాటరీ ఖర్చును భారీగా తగ్గించే సరికొత్త టెక్నాలజీని ఈ కారులో వాడడనున్నట్లు తెలిపింది.
అయితే దీనిపై ఇప్పటి వరకూ ఆపిల్ అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఆపిల్ కార్లను ఎవరు అసెంబుల్ చేస్తారన్న దానిపై ఇంకా సృష్టత రాలేదు. సాంప్రదాయ కార్ల తయారీ సంస్థతో డీల్ కుదుర్చుకొని తమ కార్లను అసెంబుల్ చేసే పని అప్పగించాలని ఆపిల్ భావిస్తున్నట్లు సమాచారం.