
సంస్థాగత రుణాలు, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలన్నదే లక్ష్యంగా సాగుతున్నట్లు నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులు తెలిపారు. హైదరాబాద్లో రెండు రోజుల పాటు సాగే నాబార్డ్ డీడీఎంల జోనల్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో తెలంగాణ, ఏపీ నాబార్డ్ శాఖలు, ఎస్బీఐ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సమావేశానికి నాబార్డ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీజీఎంలు వైకే రావు, జన్నవార్ పాల్గొన్నారు.