9 ఏళ్లకే మిలియన్ డాలర్ల సంపాదన....

9-year-old-ryan-kaji-becomes-highest-paid-youtuber-of-2020-earns-rs-220-crore-from-june-2019-20

అమెరికాకు చెందిన 9 ఏళ్ల ర్యాన్‌ కాజీ మాత్రం చిన్న వయసులోనే మిలియన్‌ డాలర్లు సంపాదిస్తున్నాడు. వినడానికి ఆశ్యర్యకంగా ఉన్నా ఇది మాత్రం నిజం. అసలు విషయంలోకి వెళితే.. ర్యాన్‌ కాజీ ర్యాన్స్‌ వరల్డ్‌ అనే పేరుతో యూట్యూబ్‌ చానల్‌ నిర్వహిస్తున్నాడు. ఇందులో అతడు వివిధ బొమ్మలతో ఆడుకుంటూనే వాటిపై సమీక్ష నిర్వహిస్తాడు. అలా అతని చానల్‌కు 27 మిలియన్లకు పైగా సబ్‌ స్కైబర్స్‌ ఉన్నారు. అతడి సంపాదన చూస్తే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే. 2018లో అతడు య్యూటూబ్‌ ద్వారా 17 మిలియన్లు సంపాదించగా.. 2019లో అది 26 మిలియన్లకు చేరుకుంది.

ఈ ఏడాది ఏకంగా 30 మిలియన్లు సంపాదించిన ర్యాన్‌ కాజీ వరుసగా మూడేళ్లలో అత్యధికంగా డబ్బులు పొందిన యూట్యూబర్‌గా నిలిచాడు. ఇటీవలే మిలియన్‌ డాలర్ల విలువైన నికెలోడియన్‌లో ఒక టీవీ సిరీస్‌ కోసం ర్యాన్‌కాజీ ఒక ఒప్పందంపై సంతకం చేయడం విశేషం. అంతేకాదు ర్యాన్‌ కాజీకి, అతడి తల్లిదండ్రులకు కలిపి మొత్తం తొమ్మిది యూట్యూబ్‌ చానల్స్‌ ఉండగా.. అన్నింటికీ మిలియన్ల వ్యూస్‌ వస్తున్నాయి. ఇప్పుడు ర్యాన్‌ కాజీ అమెరికాలో సేన్షేషనల్‌ స్టార్‌గా మారిపోయాడు. ఈ బుడ్డోడు నిజంగా జీనియస్‌ అంటూ అతనిపై ప్రశంసలు వస్తున్నాయి.