ఉద్యోగులకు కోకాకోలా షాక్!

Coca Cola laying off 2200 workers as it pares brands

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఏ మారుమూల ప్రదేశానికి వెళ్లిన కోకాకోలా కంపెనీ ఉత్పత్తులు కనిపించకుండా ఉండవంటే అతిశయోక్తికాదు. అలాంటి కంపెనీ ఇప్పుడు కరోనా కోరల్లో చిక్కుకుంది. మహమ్మారి ప్రభావంతో అనేక దేశాల్లో లాక్‍డౌన్‍ విధించారు. థియేటర్లు, స్టేడియాలు మూతపడటంతో కోకాకోలా వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో నష్టాలను తగ్గించుకోవాలని కంపెనీ నిర్ణయించింది. ఇందులో భాగంగా 2200 మంది ఉద్యోగులను తొలగించనుంది. కంపెనీకి  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో ఇది 17 శాతం అని ప్రకటించింది. ఒక్క అమెరికాలోనే 1200 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం కోకాకోలాలో ప్రపంచవ్యాప్తంగా 86,200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో అమెరికాలోనే 10,400 మంది ఉన్నారు.

కరోనా ప్రభావంతో అమ్మకాలు పూర్తిగా తగ్గాయి. జూలై-సెప్టెంబర్‍ కాలంలో కంపెనీ ఆదాయం 9 శాతం తగ్గి 8.7 బిలియన్‍ డాలర్లకు పడిపోయింది. దీంతో కంపెనీ పునర్‍ నిర్మాణ పక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా ఉద్యోగులను తగ్గించుకోవడంతో పాటు వ్యాపార విభాగాలను 17 నుంచి తొమ్మిదికి కుదించనున్నామని, ప్రస్తుతం ఉన్న బ్రాండ్లను 2 వందలకు తగ్గించుకోనున్నామని కోక్‍ చైర్మన్‍, సీఈవో జేమ్స్ క్విన్సీ తెలిపారు. దీంతో ఆదాయ అయ్యే మొత్తాన్ని మినట్‍ మెయిడ్‍, సింప్లీ జ్యూస్‍, ఫండాతో పాటు, కొకా కోలా ఎనర్జీ, ఆహా స్పార్ల్కింగ్‍ వాటర్‍ వంటి కొత్త ఉత్పత్తులపై వెచ్చించనున్నామని చెప్పారు.