రాజకీయాల్లో రజనీ నెగ్గుకు వస్తారా?

Can Rajinikanth Recreate The Magic of Jayalalithaa To Succeed In Tamil Nadu Politics

దక్షిణాదిలో అత్యంత ఫాలోయింగ్‌ ఉన్న నటునిగా రజనీకాంత్‌కు గుర్తింపు ఉంటుంది. తమిళనాడులో అయితే చిన్న పిల్లవాడి నుంచి పండుముదుసలి దాకా రజనీకాంత్‌ సినిమా అంటే విపరీతమైన అభిమానం చూపిస్తుంటారు. అలాంటి రజనీకాంత్‌ రాజకీయాల్లో కూడా తన సత్తాను చాటుతానంటూ ప్రకటించి, ఊరించి, చివరకు జనవరి 1న విడుదల అంటూ ప్రకటించడంతో రజనీకాంత్‌ అభిమానుల్లో పండుగ వాతావరణం చోటు చేసుకుంది. రజనీకాంత్‌ కొత్త పార్టీ పేరు ఏమిటి? పార్టీ జెండా ఎలా ఉంటుంది? ఎజెండా ఏమిటి? పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉండబోతున్నాయి. ఆధ్యాత్మిక పార్టీ అంటున్నారు నిజమేనా.. అన్న విషయాల్లో ప్రస్తుతం తమిళనాడులో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాయి.

డిసెంబర్‌ 31న పార్టీ పెట్టబోతున్నానని రజనీ ప్రకటించడంతో అభిమానుల్లో కొత్త జోష్‌ మొదలైంది. నిజానికి ఆరోగ్యం సహకరించక పోవడంతో రజనీ పార్టీ పెట్టొద్దనుకున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో కూడా వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే చివరకు అభిమానుల ఒత్తిడి.. బీజేపీ కోరిక మేరకు రజనీ పార్టీని ప్రకటించాడని సమాచారం. ప్రస్తుతం రజనీకాంత్‌ కూడా తన అభిమానులు ఆత్మీయులు రాజకీయ సలహాదారులతో ఈ విషయంపైనే సుదీర్ఘంగా చర్చిస్తున్నారట. అయితే ఇటీవల పార్టీ డిసెంబర్‌ 31న పెట్టబోతున్నట్టు ప్రకటన చేసే సమయంలో రజనీకాంత్‌ బాబా ముద్ర చూపించారు. తనదైన స్టైయిల్లో బాబా ముద్రను చూపుతూ అభివాదం చేశారు. అయితే పార్టీ సింబల్‌ కూడా అదే అయి ఉంటుందని అంతా భావించారు. నిజానికి ఈ సింబల్‌ను గతంలోనే రజనీ ఫ్యాన్స్‌ విరివిగా వాడేవారు.

ఇదే పార్టీ సింబల్ గా పెడదామనుకున్నారట. కానీ ఎన్నికల సంఘం విడుదల చేసిన గుర్తుల జాబితాలో ఈ సింబల్‌ లేదు. ఎన్నికల సంఘం కొత్త పార్టీలకు సంబంధించిన కొన్ని సింబల్స్‌ను చూపిస్తుంది. వాటిలో ఏదో ఒకటి ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎన్నికల సంఘం వద్ద అందుబాటులో ఉన్న గుర్తుల్లో సైకిల్‌ గుర్తు అభిమానులకు తెగ నచ్చేసిందట. ఈ సింబల్‌ అయితే సులభంగా ప్రజల్లోకి వెళ్తుందని.. రజనీ సన్నిహితులు కూడా చెప్పారట. రజనీకి సన్నిహితులైన పలువురు రాజకీయ గురువులు మీడియా మిత్రులు కూడా ఈ సింబల్‌నే ఖరారు చేసుకోమని సూచిస్తున్నారట.

ఆంధ్రలో సినీనటుడు ఎన్టీఆర్‌ కూడా టీడీపీ పార్టీ స్థాపించినప్పుడు సైకిల్‌ సింబల్‌ ఆయనకు కలిసి వచ్చిందని చెబుతున్నారు. యూపీలోని సమాజ్‌ వాద్‌ పార్టీది కూడా సైకిల్‌ సింబలే. ఈ గ్నుర్తుతో ఆ పార్టీ పలుమార్లు అధికారంలోకి వచ్చింది. అందువల్ల రజనీ ఫ్యాన్స్‌ ఈ గుర్తువైపు మొగ్గు చూపినట్టు సమాచారం. రజనీకాంత్‌ హీరోగా నటించిన అణ్ణామలైలో రజనీ పాలవాడిగా సైకిల్‌పై  తిరుగ్నుతూ పాడిన 'రెక్కగ్నట్టి పరక్కుదయ్యా అణ్ణామలై సైకిల్‌ 'పాట పాడతూ వెళుతుంటాడు. ఈ పాట అప్పట్లో పెద్దహిట్‌. దీంతో ఈ గుర్తును ఎంపికచేసుకున్నట్టు సమాచారం. మరోవైపు ప్రస్తుతం రెక్కగ్నట్టి పరక్కుదయ్యా పాట సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఎజెండా విషయానికొస్తే.. తాను తమిళనాడులో ద్రవిడ పార్టీలకు భిన్నంగా ఆధ్యాత్మిక రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే రజినీకాంత్‌ అభిమానులకు సంబంధించిన మక్కల్‌ మండ్రం పార్టీ విధి విధానాలను రూప కల్పన చేసే పనిలో పడ్డాయి. రజనీకాంత్‌ పార్టీ ప్రకటనకు వేదికగా తిరుచ్చి లేదా మదురైను ఎంపిక చేయడానికి తగ్గట్టుగా సమాలోచన సాగినట్టు సమాచారం. ప్రస్తుతం కరోనా నిబంధనలు అమల్లో ఉన్న దృష్ట్యా, బహిరంగ సభకు అనుమతి దక్కేనా అనుమానాలు తప్పడం లేదు. అభిమానుల సమక్షంలో పార్టీ ప్రకటన, జెండా ఆవిష్కరణ జరగాలని రజనీ సూచించినట్టు, అందుకు తగ్న్గట్టుగా వేదికలపై ఈ నేతలు దృష్టి పెట్టి ఉండడం గమనార్హం. పార్టీ రిజిస్టర్‌ వ్యవహారాలను ఎవరికి అప్పగించాలి, అందుకు అవసరమైన అంశాలపై కూడా దృష్టి పెట్టేలా ఈ సమావేశం సాగినట్టు సమాచారం. మక్కల్‌ మండ్రం పోస్టర్లలో రజనీ ఫొటో మాత్రమే ఉండాలని, అర్జున్‌మూర్తి, తమిళరవి మణియన్‌ వంటి నేతల ఫొటోలు వద్దు అన్న సూచన చేసినట్లు తెలిసింది. 

తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకే లాంటి పార్టీలు ఉన్నప్పటికీ.. జయలలిత, కరుణానిధి మరణంతో రాజకీయ శూన్యత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పార్టీ పెడితే ప్రయోజనం ఉంటుందని రజినీకాంత్‌ భావిస్తున్నారు. రజినీ రాజకీయపార్టీ ఏర్పాటు విషయమై రాజకీయ నాయకులు ఆచితూచి స్పందిస్తున్నారు. మరోవైపు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2013లో తాను జనతాపార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నానని ప్రకటించిన తర్వాత.. అప్పటి జనతా పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యకర్తలను బీజేపీ దూరం పెట్టింది. గతంలో జనతా పార్టీ కోసం పని చేసిన వారంతా రజినీకాంత్‌ పార్టీలో చేరే అవకాశం ఉందని సుబ్రమణ్యస్వామి ట్వీట్‌ చేశారు.

పోయెస్‌గార్డెన్‌కు కళ..

జయలలిత జీవించి ఉన్న కాలంలో పోయెస్‌ గార్డెన్‌ అభిమానులతో కలకలలాడేది. భద్రత కూడా ఆ గార్డెన్‌ వీధుల్లో కట్టుదిట్టంగానే ఉంటుంది. అయితే, అమ్మలేని పోయెస్‌గార్డెన్‌ కళ తప్పింది. ఈ పరిస్థితుల్లో రజనీ రాజకీయ ప్రకటనతో మళ్లీ గార్డెన్‌ వైపు రాజకీయ కళ మొదలైంది. రజనీ కోసం అభిమానుల రాక, ముఖ్యుల రాక పెరుగుతోంది. క్రమంగా ఈసంఖ్య మరింతగా పెరగే అవకాశాలతో గార్డెన్‌ పరిసరాల్లో భద్రత చర్యలు చేపట్టక తప్పలేదు. రజనీకాంత్‌ నివాసం, ఆ మార్గంలో పదుల సంఖ్యలో పోలీసులతో భద్రతను చెన్నై పోలీసు యంత్రాంగ్నం కల్పించింది.

 


                    Advertise with us !!!