
ప్రపంచంలోనే ఎంతో గొప్ప వ్యాపార సంస్కృతితో అలరారుతున్న భారత్ చాలా ప్రత్యేకమైన, ముఖ్యమైన దేశమని ఫేస్బుక్ వ్యవస్థాపక సీఈవో మార్క్ జుకర్బర్గ్ కొనియాడారు. భారత్ ఇటీవల ప్రారంభించిన తమ వాట్సాప్ పేమెంట్ సేవలు మరింత విస్తరిస్తామని చెప్పారు. ఫేస్బుక్ ఫ్యూయల్ ఫర్ ఇండియా 2020 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జుకర్బర్గ్ చెప్పారు. ఫేస్బుక్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వాట్సాస్ భారత్లో పేమెంట్ సర్వీసులను ప్రారంభించేందుకు గత నెలలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నుంచి అనుమతి పొందిన విషయం తెలిసిందే. భారత్లో యూపీఐ ఆధారిత పేమెంట్ సేవలను ప్రారంభించేందుకు 2018 నుంచే కసరత్తు మొదలుపెట్టిన వాట్సాప్ ఎట్టకేలకు గత నెలలో ఈ సేవలను ప్రారంభించింది. ప్రపంచంలో వాట్సాప్ పేమెంట్ సేవలు తొలుత భారత్లోనే ప్రారంభం కావడం విశేషం.