ర్..సెటిలర్...

Settlers saved the face KCR in GHMC

గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపించింది. గత జిహెచ్‌ఎంసి, అసెంబ్లీ ఎన్నికల్లో  తెరాసకే మద్ధతునిచ్చిన సీమాంధ్ర ఓటర్లు ఈ ఎన్నికల్లోనూ అదే పంధా కొనసాగించారు. అయితే కొన్ని కొన్ని డివిజన్లలో స్థానిక అభ్యర్ధుల మీద ఉన్న వ్యతిరేకత భాజాపా వైపు వీరిని మళ్లించింది. సీమాంధ్ర ఓటర్లు ఎక్కువగా నివసించే శేరిలింగంపల్లిలో తెరాస ఆధిక్యం ప్రదర్శించగా, కుకట్‌పల్లిలో  క్లీన్‌ స్వీప్‌ చేసేసింది. అదే విధంగా  ప్రత్యేక తెలంగాణ సాధించి అచ్చమైన తెలంగాణ పార్టీగా నిర్వచించుకున్న తెరాసకు దక్షిణ తెలంగాణ ప్రాంతంలో షాక్‌ తగిలింది. గ్రేటర్‌ పరిధిలోని ఎల్బీనగర్, మహేశ్వరం వంటి  తెలంగాణ ఓటర్లు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో భాజాపా విజయఢంకా మోగించింది. ఇక హిమాయత్‌నగర్, ఘోషామహల్, గన్‌ఫౌండ్రి, బేగంబజార్‌ వంటి ఉత్తర భారతీయులు ఎక్కువగా ఉండే చోట మాత్రం ఊహించినట్టే భాజాపా తన ప్రతాపం చూపింది. ఈ సారి జనసేన పార్టీ తమ మద్ధతు భాజాపాకే అని ప్రకటించినప్పటికీ... ఆ పార్టీ సానుకూలురు, పవన్‌ అభిమానులు సైతం భాజాపా వైపు పెద్దగా మొగ్గు చూపకపోవడం గమనార్హం.

గత కొంత కాలంగా దాదాపుగా ప్రతి ఎన్నికలోనూ ఆంధ్రా సెటిలర్లు తెలంగాణ రాష్ట్ర సమితికి మద్ధతు అందిస్తుండడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్‌తో విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే... ఆంధ్రుల్ని రకరకాల ఇబ్బందులకు గురిచేస్తారని సందేహాలు రేకెత్తాయి. అందుకు తగ్గట్టే పలువురు తెలంగాణ నేతల వ్యాఖ్యలు దానికి ప్రతిగా సీమాంధ్ర నేతల ఆగ్రహావేశాలు...ఈ గొడవలు వరుసగా చోటు చేసుకోవడం... వెరసి విభజనానంతరం తమ పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళన హైదరాబాద్‌లో నివసించే సీమాంధ్ర ప్రజల్లో ఏర్పడింది. అయితే కాలక్రమంలో ఆ భయాందోళనలకు కాలం చెల్లింది. ఇది అమాంతం తెరాసపై సెటిలర్లలో మంచి అభిప్రాయం ఏర్పడడానికి కారణమైంది. దానికి తోడుగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు,అక్కడి గందరగోళంతో పోలిస్తే తెలంగాణలోనే ప్రశాంత పరిస్థితులు, అభివృద్ధి కనపడడంతో కెసియార్‌ పాలన సామర్ధ్యంపై కూడా గురి కుదిరింది.

అదే ప్రతి ఎన్నికలో గ్రేటర్‌ సెటిలర్లను తెరాసవైపు మొగ్గేలా చేస్తోంది. కరోనా నియంత్రణ చర్యల విషయంలో పెద్దగా సంతృప్తి వ్యక్తం కాకపోయినా అదేమీ సెటిలర్ల మీద ప్రభావం చూపలేదు. అలాగే లాక్‌ డవున్‌ అనంతర పరిస్థితులు, ఎల్‌ఆర్‌ఎస్‌ సమస్యలు వంటివి సెటిలర్లను నేరుగా ఇబ్బంది పెట్టే అంశాలు కాకపోవడం కూడా మరో కారణం. గ్రేటర్‌లో ఉన్న సీమాంధ్రుల్లో అత్యధికులు చిరు వ్యాపారులు, ప్రైవేట్‌ కంపెనీ ఉద్యోగులు, ఐటి రంగంలో ఉన్నవారే తప్ప ప్రభుత్వ నిర్ణయాల వల్ల తీవ్ర ప్రభావం పడే ప్రభుత్వోద్యోగులు కారు. అంతేకాకుండా గత కొంతకాలంగా కెసియార్‌కు అండగా నిలుస్తున్న టాలీవుడ్‌ తన పంధాను కొనసాగిస్తూ ఈ ఎన్నికల్లోనూ ప్రత్యక్షంగా, పరోక్షంగా తెరాసకు మద్ధతుగా రంగంలోకి దిగడం కూడా సెటిలర్లపై ప్రభావం చూపింది. ఏమైతేనేం... మరోసారి సీమాంధ్ర ఓటర్లు రాష్ట్ర విభజన కారక పార్టీ అయిన తెరాసకు అండగా నిలిచి... సాధారణ ప్రజలకు తమ బాగోగులే ముఖ్యమని, పెద్దోళ్ల రాజకీయాలు తమకు అనవసరమని స్పష్టం చేశారు. 

 

అలాగే లాక్‌ డవున్‌ అనంతర పరిస్థితులు, ఎల్‌ఆర్‌ఎస్‌ సమస్యలు వంటివి సెటిలర్లను నేరుగా ఇబ్బంది పెట్టే అంశాలు కాకపోవడం కూడా మరో కారణం. గ్రేటర్‌లో ఉన్న సీమాంధ్రుల్లో అత్యధికులు చిరు వ్యాపారులు, ప్రైవేట్‌ కంపెనీ ఉద్యోగులు, ఐటి రంగంలో ఉన్నవారే తప్ప ప్రభుత్వ నిర్ణయాల వల్ల తీవ్ర ప్రభావం పడే ప్రభుత్వోద్యోగులు కారు. అంతేకాకుండా గత కొంతకాలంగా కెసియార్‌కు అండగా నిలుస్తున్న టాలీవుడ్‌ తన పంధాను కొనసాగిస్తూ ఈ ఎన్నికల్లోనూ ప్రత్యక్షంగా, పరోక్షంగా తెరాసకు మద్ధతుగా రంగంలోకి దిగడం కూడా సెటిలర్లపై ప్రభావం చూపింది. ఏమైతేనేం... మరోసారి సీమాంధ్ర ఓటర్లు రాష్ట్ర విభజన కారక పార్టీ అయిన తెరాసకు అండగా నిలిచి... సాధారణ ప్రజలకు తమ బాగోగులే ముఖ్యమని, పెద్దోళ్ల రాజకీయాలు తమకు అనవసరమని స్పష్టం చేశారు.