‘పావ కథైగల్’ చిత్రంలో తన అందాలను ఓపెన్ చేసి లెస్బియన్ ‌గా నటించిన అంజలి

Paava Kadhaigal Official Trailer

అచ్చ తెలుగు హీరోయిన్  అంజలి లెస్బియన్‌గా మారింది  నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన ‘పావ కథైగల్’ సినిమాలో అంజలి లెస్బియన్‌గా నటించారు. ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్. ఓటీటీ రంగంలో పోటీని ఎదుర్కోవడానికి నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం రీజినల్ కంటెంట్‌పై దృష్టిపెట్టింది. దీనిలో భాగంగా ప్రాంతీయ భాషల్లో ఆసక్తికర సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. తాజాగా తమిళంలో ఒక ఆసక్తికర సినిమాను సిద్ధం చేసింది. నాలుగు విభిన్న కథలతో మిళితమై ఉన్న ‘పావ కథైగల్’ అనే ఈ సినిమాను డిసెంబర్ 18న విడుదల చేస్తోంది. అయితే, ఈ సినిమా ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ తాజాగా విడుదల చేసింది.‘పావ కథైగల్’కు నలుగురు ప్రముఖ దర్శకులు దర్శకత్వం వహించారు. 

సుధ కొంగర, వెట్రిమారన్, గౌతమ్ మీనన్, విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకులు. ఈ నలుగురు నాలుగు కథలకు దర్శకత్వం వహించారు. ఈ నాలుగు కథలు కలిసి ఈ సినిమా. ప్రకాష్ రాజ్, సాయి పల్లవి, అంజలి, సిమ్రన్, గౌతమ్ మీనన్, ఆదిత్య భాస్కర్, భవాని శ్రీ, హరి, కాలిదాస్ జయరాం, కల్కి కొచ్లీన్, పాదం కుమార్, శాంతను భాగ్యరాజ్ లాంటి ప్రముఖ నటులు నటించారు.ఈ చిత్ర ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ తాజాగా విడుదల చేసింది. ఈ ట్రైలర్‌లో నాలుగు కథలకు సంబంధించిన సన్నివేశాలను చూపించారు. ప్రకాష్ రాజ్, సాయి పల్లవి తండ్రీ కూతుళ్లుగా కనిపించారు. సాయి పల్లవి గర్భవతిగా నటించారు. రెండో కథలో గౌతమ్ మీనన్ ఒక పాపకు తండ్రిగా కనిపించారు. ఆయన వ్యోమగామి కావాలని కోరుకుంటారు. గౌతమ్ మీనన్‌కు భార్యగా సిమ్రన్ నటించారు. ఇక విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన మూడో కథలో అంజలి మరో అమ్మాయితో ప్రేమలో పడుతుంది.

అంటే, అంజలి లెస్బియన్‌గా నటించింది. కులం, పరువుకు ప్రాధాన్యత ఇచ్చే అంజలి తండ్రి ఆమె లెస్బియన్ లవ్‌కు ఓకే చెప్తాడా అనేది ఆసక్తికరం. ఈ లెస్బియన్ లవ్ సీన్స్‌లో అంజలి కాస్త ఘాటుగానే కనిపించింది. దీంతో ప్రస్తుతం ఈ కథ చర్చనీయాంశం అయ్యింది. ఇక కాళిదాస్ జయరాం, శాంతను భాగ్యరాజ్ నటించిన నాలుగో కథ ముస్లిం అబ్బాయి, హిందు అమ్మాయి మధ్య ప్రేమను తెలియజేస్తుంది. ఇలా నాలుగు కథలతో కూడిన ఈ సినిమా ఏ మేర ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. 


                    Advertise with us !!!