జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో తగ్గిన పోలింగ్‌...

Hyderabad voters shock all parties with poor turnout at GHMC polls

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ)పోలింగ్‌ ముగిసింది. అయితే జీహెచ్‌ఎంసీలో ఓటింగ్‌ శాతం దారుణంగా పడిపోయింది. నగర వాసులు ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు. వరుస సెలవులు ఉండటంతో సొంతూళ్లకు వెళ్లిపోయారు. మరో? వైపు కరోనా భయంతో ఓటు వేసేందుకు జనం బయటకు రాలేదు. చాలా కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇవ్వడంతో ఐటీ ఉద్యోగులు సొంతూళ్ల నుంచే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. గత ఎన్నికల కంటే ఈ సారి అతి తక్కువ పోలింగ్‌ నమోదైనట్లు తెలుస్తోంది.

ఆర్సీపురం, పటాన్‌చెరు, అంబర్‌పేట్‌లో అత్యధిక ఓటింగ్‌ శాతం నమోదు కాగా, మలక్‌పేట్‌, కార్వాన్‌లో అత్యల్పంగా ఓటింగ్‌ నమోదైనట్లు తెలుస్తోంది. ఉదయం సమయంలో ఎక్కువగా నమోదైన పోలింగ్‌.. మధ్యాహ్నం భారీగా తగ్గిపోయింది. మొత్తంగా గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో పోలింగ్‌ శాతం దారుణంగా పడిపోయింది. ఇక గుర్తులు తారుమారుతో ఓల్డ్‌ మలక్‌పేట్‌లో పోలింగ్‌ రద్దయింది. అక్కడిసెంబర్‌ 3న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఫలితంగా ఈ రోజు వెల్లడించాల్సిన ఎగ్జిట్‌ పోల్స్‌ వాయిదా పడ్డాయి. రీపోలింగ్‌ ముగిసే వరకు ఎవరూ ఎలాంటి ఎగ్జిస్ట్‌ పోల్స్‌ ప్రకటించడానికి వీలు లేదని ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. డిసెంబర్‌ 4న ఫలితాలు ప్రకటించనున్నారు.