జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న సినీ ప్రముఖులు

Tollywood Celebrities Cast Their Votes In GHMC Elections

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలందరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు సినీనటుడు రాజేంద్ర ప్రసాద్. ఓటుహక్కు వినియోగించుకోకపోతే ప్రశ్నించే హక్కు కోల్పోతారన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ నగర ప్రజలందరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సారి జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో సాధారణ పౌరులు కంటే సెలెబ్రిటీలు ఎక్కువగా  తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో మెగా స్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ, నాగార్జున ఆయన సతీమణి అమల, డాక్టర్ రాజ శేఖర్ ఆయన సతీమణి అమల జీవిత, హీరో లు రవి తేజ, రామ్, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, కుటుంబ సభ్యులు,  నిఖిల్, బెల్లంకొండ శ్రీనివాస్, అల్లు శిరీష్, దర్శకుడు క్రిస్స్, రాజ్ కందుకూరి, మధుర శ్రీధర్, మంచు లక్ష్మి, కృష్ణంరాజు కుమార్తె ప్రసీద, పరుచూరి బ్రదర్స్ , ఇంకా అనేకమంది సెలబ్రిటీస్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

సినీనటుడు రాజేంద్రప్రసాద్. కేపీహెచ్‌ ఏడో ఫేజ్‌లోని పోలింగ్ బూత్ నంబర్ 58లో కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు ఉదయం ఆయన తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల్లో ఓటు వేయకపోవడం పెద్ద నేరమని అన్నారు.తమ భవిష్యత్తునే నిర్దేశించే ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యతని రాజేంద్రప్రసాద్ అన్నారు. ప్రజాప్రతినిధులను నిలదీయాలన్నా, మనకు కావాల్సింది అడిగి నెరవేర్చుకోవాలన్నా ప్రతి ఒక్కరు ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. తాను అరకులో షూటింగులో బిజీగా ఉన్నప్పటికీ ఓటు వేసేందుకే హైదరాబాద్‌కు వచ్చానన్నారు. పోలింగ్ కేంద్రం బోసిపోవడం చూసి తన మనసు చలించిపోయిందని, నగర ప్రజలు తప్పనిసరిగా తమ ఓటుహక్కు వినియోగించుకుని నగర అభివృద్ధితో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.