సింగర్ సునీత రెండో పెళ్లి వార్త లో నిజమెంతా?

Singer Sunitha is all set to enter the wedlock for the second time

గత రెండు మూడు రోజులుగా సింగర్ సునీత పెళ్లి వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు గాసిప్ రాయుళ్లు. దీనిపై సునీత నుంచి స్పందన రాకపోవడంతో జనాల్లో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది.  అదిగో పులి అంటే అదిగో తోక అంటారు కొందరు గాసిప్ రాయుళ్లు. ఏ చిన్న హింట్ దొరికినా దానికో కథ అల్లేసి కన్ఫ్యూజన్‌లో పడేస్తుంటారు. ఈ క్రమంలోనే గత రెండు మూడు రోజులుగా సింగర్ సునీత పెళ్లి వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు. సునీత రెండో పెళ్లికి సిద్ధమైందని కొందరంటే.. ఆమెకు కాబోయే భర్త ఈయనే అంటూ ఇంకొందరు మరో అడుగు ముందుకేసి మ్యాటర్ చెప్పేశారు. దీంతో టాలీవుడ్ సర్కిల్స్‌లో ఈ అంశం హాట్ టాపిక్ అయింది.తెలుగు చిత్రసీమలో సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సునీత.. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ పాడింది. 

యాంకర్‌గా, హోస్ట్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. అంతేకాదు పేరుకే సింగర్ అయినా అందంతో కూడా తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది సునీత.  కాకపోతే పెళ్లి విషయంలో మాత్రం ఆమె  ఫెయిల్ అయింది. పర్సనల్ లైఫ్‌లో చాలా కష్టాలు అనుభవించింది. 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న ఆమె.. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టాక కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని భర్తకు దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సునీత రెండో పెళ్లి గురించి గత కొన్నిరోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి.

తాజాగా బయటకొచ్చిన న్యూస్ ప్రకారం అతిత్వరలో ఆమె రెండో పెళ్లి జగరనుందని,  డిజిటల్‌ రంగంలో హవా కొనసాగిస్తున్న ఓ బిజినెస్‌మ్యాన్‌ను సునీత పెళ్లి చేసుకోబోతోందని చెబుతున్నారు. సునీతను చేసుకోబోయే వాడిది కూడా రెండో పెళ్లే అనే టాక్ నడుస్తోంది. గతంలో సునీత విషయపై ఇలాంటి రూమర్సే రాగా.. తాను ఇలాంటి రూమర్స్ పెద్దగా పట్టించుకోనని చెప్పింది. అయినా మళ్లీ ఇప్పుడు అదే రకమైన రూమర్స్ షికారు చేస్తుండటం, ఇప్పుడు సునీత నుంచి రియాక్షన్ రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది..

 


                    Advertise with us !!!