యాపిల్ కు కోటీ 20 లక్షల డాలర్ల ఫైన్!

Italy fines Apple nearly $12M over misleading claims

టెక్‍ దిగ్గజం యాపిల్‍ తప్పుదోవ పట్టించే వ్యాపార విధానాలు అనుసరించినందుకు ఇటలీలోని యాంటీట్రస్ట్ అథారిటీ కోటీ 20 లక్షల డాలర్లు జరిమానా విధించింది. ఐఫోన్లకు సంబంధించి ఈ విధానాలు అనుసరించినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని అక్కడి నియంత్రణ సంస్థలే ఒక ప్రకటనలో వెల్లడించాయి. యాపిల్‍ సంస్థ వివిధ రకాల ఐఫోన్‍ మోడళ్లపై ఎటువంటి వివరాలు లేకుండా వాటర్‍ రెసిస్టెంట్లుగా ప్రచారం చేసిందని నియంత్రణ సంస్థలు పేర్కొన్నాయి. కంపెనీ డిస్‍క్లైమర్‍లో మాత్రం ద్రవ పదార్థాల నుంచి ఫోన్‍ దెబ్బ తింటే వారంటి వర్తించదని పేర్కొంది. దీంతోపాటు నీటిలోపడి ఫోన్లు దెబ్బతిన్న వారికి సంస్థ ఎటువంటి సహకారం అందించలేదు.