ఏఆర్ రెహమాన్ కు అరుదైన గౌరవం

AR Rahman is BAFTA Breakthrough India Ambassador

సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సంగీత దర్శకుడు ఏఆర్‍ రెహమాన్‍. ఆస్కార్‍ అవార్డ్ అందుకున్న రెహమాన్‍కు తాజాగా అరుదైన గౌరవం దక్కింది. బ్రిటిష్‍ అకాడమీ ఆఫ్‍ ఫిల్మ్ అండ్‍ టెలివిజన్‍ ఆర్‍ట్స(బాఫ్టా) సంస్థ ఇండియన్‍ బ్రేక్‍ త్రూ ఇనిషియేటివ్‍ అంబాసిడర్‍గా రెహమాన్‍ని నియమించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. నెట్‍ఫ్లిక్స్ సహకారంతో భారత్‍లో ఉన్న గొప్ప కళాకారులను గుర్తించడానికి ఏఆర్‍ రెహమాన్‍ను అంబాసిడర్‍గా నియమించింది. ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన రెహమాన్‍.. బాఫ్టాతో పని చేస్తూ, సినిమాలు, టీవీ, ఆట ఇలా పలు రంగాలలో అద్భుతమైన ప్రతిభ కనబరిచే వారిని గుర్తించడం కోసం ఉత్సాహంగా ఉన్నాను అని పేర్కొన్నారు. భారత్‍లో అద్భుతమైన టాలెంట్‍ కలిగి ఉన్న ఆర్టిస్టులను ప్రపంచవేదికపై నిలబెట్టడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్టు సృష్టం చేశారు.