వంద రోజుల మహిళా మార్చ్ బ్రోచర్ ను విడుదల చేసిన సీఎం

YS Jagan launches 100 Days Mahila March Brochure in the Assembly

ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍మోహన్‍ రెడ్డి వంద రోజుల మహిళా మార్చ్ బ్రోచర్‍ను విడుదల చేశారు. నవరత్నాలు, ప్రభుత్వ పథకాల అమలు, దశలవారీ మధ్యపాన నిషేధం, దిశ యాప్‍, ఇతర చట్టాలు, హెల్ప్లైన్‍ నంబర్లపై.. మార్చి 8 వరకు వందరోజుల కార్యాచరణ నిర్వహించనున్నారు. వంద రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాలేజీ విద్యార్థినులకు రక్షణ టీంలు, సైబర్‍ నేరాలపై మహిళా కమిషన్‍ అవగాహన సదస్సులు నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, డీజీపీ గౌతం సవాంగ్‍, ఆంధప్రదేశ్‍ మహిళా కమిషన్‍ ఛైర్‍ పర్సన్‍ వాసిరెడ్డి పద్మ, ఏపీఐఐసీ చైర్‍ పర్సన్‍ ఆర్కే రోజా, వ్యవసాయ శాఖ స్పెషల్‍ చీఫ్‍ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‍ అనురాధ, మహిళ కమిషన్‍ డైరెక్టర్‍ ఆర్‍ సుయజ్‍ పాల్గొన్నారు.

 


                    Advertise with us !!!