రాజకీయ ప్రవేశంపై త్వరలో ప్రకటన

Rajinikanth Says Decision Soon On Polls

సూపర్‍స్టార్‍ రజనీకాంత్‍ రాజకీయ పయానికి సంబంధించిన సస్పెన్స్ కొనసాగుతోంది. రాజకీయ ప్రవేశంపై త్వరలోనే ప్రకటన చేయనున్నట్టు ఆయన తెలిపారు. చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపం వేదికగా రజనీ మక్కల్‍ మండ్రం ముఖ్య నిర్వాహకులు, జిల్లాలో కార్యదర్శులతో రజనీకాంత్‍ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా అభిప్రాయాలను కలుబోసుకున్నాం. నేను ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అండగా ఉంటామని భరోసాయిచ్చారు. సాధ్యమైనంత తొందరలో నా నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు.

కాగా, రజనీకాంత్‍ చాలాకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అభిమానులతో ఆయన మరోసారి భేటీ అయ్యారు. ఈ సమావేశం తర్వాత సృష్టత వస్తుందని ఎదరు చూసినా అభిమానులకు నిరాశే మిగిలింది. తన రాజకీయ ప్రవేశంపై రాజనీకాంత్‍ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు.

 


                    Advertise with us !!!