ఏపీ ప్రభుత్వం మరో రికార్డు..

AP reports 620 new cases; total tests cross 1-crore mark

కరోనా పరీక్షల విషయంలో ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం రికార్డులపై రికార్డులు నమోదు చేసుకొంటోంది. దేశంలో ఢిల్లీ తరువాత ఏపీయే కరోనా పరీక్షలు పెద్ద ఎత్తున చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆంధప్రదేశ్‍ రాష్ట్రం రికార్డు స్థాయిలో కరోనా వైరస్‍ నిర్ధారణ పరీక్షలు చేయించింది. ఇప్పటి వరకు కోటి 17వేల 126 పరీక్షలు నిర్వహించింది. గత 24 గంటల్లో 54,710 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 690 మందికి పాజిటివ్‍ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,67,683 కు చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి కోలుకుని 3,787 మంది డిశ్చార్జ్ అవ్వగా, మొత్తం 8,52,298 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‍ కేసుల సంఖ్య 8,397. వైరస్‍ బాధితుల్లో కొత్తగా 7 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 6,988కి చేరింది. ఈ మేరకు ఆంధప్రదేశ్‍ వైద్యారోగ్యశాఖ కరోనాపై హెల్త్ బులెటిన్‍ విడుదల చేసింది.

 


                    Advertise with us !!!