
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేయడం ఖాయమేనని తమిళనాడులో ప్రచారం సాగుతోంది. రజనీ మక్కల్ మండ్రం పేరిట గతంలో ఆయన ఒక వేదికను స్థాపించారు. మండ్రం జిల్లా కార్యదర్శులతో రజనీ చెన్నైలో సమావేశం కానున్నారు. అనారోగ్య సమస్యలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించినప్పటికీ ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టాలని భావిస్తున్నట్లు అభిమానులు చెబుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందంటున్నారు. సరైన సమయంలో నిర్ణయాన్ని ప్రకటిస్తానని రజనీ ఇంతకుముందే తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్-మేలో జరగనున్నాయి.