నేను జోకర్ ని కాదు ఫైటర్ ని... ఎమ్మెల్సీ కవిత కామెంట్‌పై బండ్ల గణేష్ రియాక్షన్

bandla ganesh counter to telangana mlc kavitha

నేను జోకర్ కాదు ఫైటర్ అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ట్యాగ్ చేస్తూ ట్వీట్ పెట్టారు బండ్ల గణేష్. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల గణేష్‌ చేసిన హడావుడి అంతా ఇంత కాదు. కాంగ్రెస్‌ పార్టీలో చేరి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీపై  అనేక విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు చేయని విమర్శలు ఆయన చేశారు. ఆ తర్వాత ఎన్నికలు ముగిసిన కొద్ది కాలానికే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. తాజాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి బండ్ల గణేష్‌ పేరు పొలిటికల్‌ తెరపైకి వచ్చింది.ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... గత అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల గణేష్‌ చేసిన కామెడీలా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో  బండి సంజయ్ చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో మరోసారి బండ్ల గణేష్‌ వార్తల్లో నిలిచారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియా వేదికగా బండ్ల గణేష్‌ స్పందించారు. ‘నేను జోకర్‌ని కాదు.ఫైటర్‌ని. కానీ ప్రస్తుతం ఎలాంటి రాజకీయ పార్టీలో ఉండదలచుకోలేదు. ఆల్ ది బెస్ట్'అని పేర్కొంటూ కవితకు ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్‌ వైరల్‌ అయింది.ఈ నేపథ్యంలో తాజాగా కవిత కామెంట్‌పై రియాక్ట్ అయ్యారు బండ్ల గణేష్. ''నేను జోకర్‌ని కాదు.. ఫైటర్‌ని.. కానీ ప్రస్తుతం ఎలాంటి రాజకీయ పార్టీలో ఉండదలచుకోలేదు. ఆల్ ది బెస్ట్'' అని పేర్కొంటూ కవితకు ట్యాగ్ చేశారు. ఆయన చేసిన ఈ కామెంట్ చూసి.. బండ్లన్నకు మద్దతుగా భిన్న రకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. తనకు రాజకీయాలతో సంబంధం లేదు మొర్రో అని మొత్తుకుంటున్నా కొందరు పనిగట్టుకుని మరీ ఆయన‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పదే పదే తాను ఏ రాజకీయ పార్టీలో లేనని చెప్పుకొస్తున్నారు బండ్ల గణేష్. దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దని ఒకటికి పది సార్లు అభ్యర్థిస్తుండటం గమనార్హం. ఇకపోతే రీసెంట్‌గా 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటించిన బండ్ల గణేష్.. తిరిగి నిర్మాతగా పలు సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు.