'ఆచార్య' లో రామ్ చరణ్ ది చిన్న పాత్రేమీ కాదు.... హీరోయిన్ కూడా ఉందట!

Ram Charan to play a key role in Acharya

పెద రాయుడు చిత్రంలో రజిని ఉన్నంత సేపు ఎలా దడ దడ లాడించాడో అలా థియేటర్ దద్ధరిల్లిస్తాడట!!  

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మ్యాట్నీ మూవీస్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.అందాల భామ కాజల్ అగర్వాల్..చిరూ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి ప్రేక్షకులల్లో భారీ స్పందన లభించింది.హిందూ దేవాలయాల చుట్టూ సాగే కోణంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవల లాక్ డౌన్ వల్ల ఆగిపోయింది. మళ్ళీ కేంద్ర అనుమతులతో ఈ సినిమా షూటింగ్ ని రీసెంట్ గా మొదలు పెట్టింది మూవీ యూనిట్.  ఇక ఇదిలా ఉంటే చిరంజీవితోపాటుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో నటించబోతున్నాడు. సినిమాలో కీలక పాత్రలో చరణ్ కనిపించనున్నాడు. 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నాడని తెలిసిందే. సినిమాలో చరణ్ రోల్ ఎలా ఉండబోతుంది అన్న విషయాలపై ఇప్పటికే కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఆచార్య సినిమాలో చరణ్ సరిగా ఇంటర్వల్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. సినిమాలో చరణ్ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ అంటే ప్రీ క్లైమాక్స్ లో వస్తాడట. ఫస్ట్ హాఫ్ ముందు ఓ పది నిమిషాలు దడ దడ లాడిస్తాడట. ఇక ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో మరో 20 నిమిషాలు అదరగొడతారట. సినిమాలో విలన్ తో ఫైట్ చేసే క్రమంలో ఒక సీన్ చరణ్ చేస్తే అదే సీన్ రిపీట్ చేస్తూ చిరు కనిపిస్తాడని తెలుస్తుంది. కొరటాల శివ ఈ సీన్ చాలా క్రేజీగా ప్లాన్ చేశాడని తెలుస్తుంది. సినిమాలో ఇప్పటికే చిరు పోర్షన్ దాదాపు పూర్తి అయ్యిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో చరణ్ కు సంబందించిన షూటింగ్ జరగాల్సి ఉంది. సినిమాలో చరణ్ రోల్ మెగా ఫ్యాన్స్ కు ఫుల్ మజా ఇస్తుందని అంటున్నారు. సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన ఇచ్చిన బిజిఎం కూడా సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తుందని అంటున్నారు. 

ఇక సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వల్ హీరోయిన్ గా నటిస్తుంది. చరణ్ పక్కన ఎవరన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదు. అయితే చరణ్ సరసన కూడా ఓ హీరోయిన్ కనిపించనుందట. చరణ్ పక్కన నటించే హీరోయిన్ అంటూ చాలా పేర్లు వినిపించాయి. మిల్కీ బ్యూటీ తమన్నా నటించనుందని వార్తలు వచ్చాయి. ఆతర్వాత చరణ్ తో ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించిన కియారా అద్వానీ నటిస్తుందని ప్రచారం జరిగింది. రకుల్, రష్మిక ఇలా మూడు నాలుగు పేర్లు కూడా వినిపించాయి. అయితే తాజాగా చరణ్ సరసన కొత్త భామను తీసుకోవాలి చూస్తున్నారట దర్శకనిర్మాతలు. వచ్చే వారం హీరోయిన్ ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇటీవలే ప్రారంభమైన షూటింగ్ లో చిరు – చరణ్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించాలని కొరటాల ప్లాన్ చేస్తున్నారట. దానికోసం ఇప్పటికే రాజమౌళిని అడిగినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం చరణ్.. RRR షూటింగ్ లో బిజీగా వున్నాడు. ఒకవేళ చరణ్ ఆచార్య షూటింగ్ కి రావాలంటే.. RRR షూటింగ్ కి కొంచెం బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఒకవైపు దర్శకుడు కొరటాల శివ..మరోవైపు చిరంజీవి.. ఇద్దరూ రాజమౌళిని రిక్వెస్ట్ చేస్తే... దానికి మన జక్కన్న కూడా ఓకే చెప్పాడని సమాచారం. ఇక త్వరలో చిరూ, చరణ్ లకు సంబంధించిన సీన్స్ ని కొరటాల శివ చిత్రికరించనున్నట్లు ఫిల్మ్ నగర్ నుండి వార్తలు వస్తున్నాయి...!!