సీతగా కృతి సనన్ ఏంటిరా బాబూ! డైరెక్టర్ కి మైండ్ దొబ్బిందా అంటున్న ప్రభాస్ ఫాన్స్

Kriti Sanon to play Sita opposite Prabhas Ram in Adipurush

ఫ్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాలో రాముడిగా ప్రభాస్ ని అనుకున్నారు.  ఆజానుబాహుడు ఆరడుగుల అందగాడు కాబట్టి ప్రభాస్ ఓకే అనుకున్నారు అంతా? రావణాసురుడు సైఫ్ అలీ ఖాన్ అనుకున్నారు నాయకుడు ప్రతినాయకుడు పాత్రల వరకు బాగానే వుంది. మరి  సీత ఎవరూ అన్నది మాత్రం ఇప్పటికీ ఒక చర్చగానే ఉంది. రకరకాల పేర్లు కూడా వినిపించాయి  సీత పాత్రలో నటించే వారికి నటనతో పాటు, ప్రభాస్ తో మాచ్ అయ్యేలా విధంగా  ఉండాలి. ఆ విధంగా అనేక పేర్లు అనుకుని ఇపుడు బాలీవుడు భామ  కృతి సనన్ దగ్గరకు వచ్చి ఆగారని అంటున్నారు. మరి సీత పాత్రకు ఆమె నప్పుతుందా అంటే కాదు అంటున్నారు కొందరు. కృతి ఈ  పాత్రను మోయలేదని  చేయలేదని అపుడే నెగిటివ్ కామెంట్స్ పడుతున్నాయి. 

ఆ అమ్మడు తెలుగులో మహేష్ బాబు సరసన నేనొక్కడినే మూవీతో హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం  చేసింది. ఆ తరువాత నాగ చైతన్యతో దోచేయ్ మూవీ చేసింది. రెండూ ఫట్ మన్నాయి. హిందీ లో చేసిన సినిమాలన్నీ అంతంత మాత్రమే ఆడాయి.  ఇక ఆమెలో ట్రెడిషనల్ లుక్ కంటే గ్లామర్ గా బబ్లీ లుక్ లో  కనిపిస్తుంది. ఆమెను సీత పాత్రకు తీసుకోవద్దు అని అప్పుడే  సజెషన్స్ కూడా వస్తున్నాయట. అయితే ఆమెని తీసుకోవాలని దాదాపుగా ఫిల్మ్ డైరెక్టర్ ఓం రౌత్ ఫైనల్  డెసిషన్ తీసుకున్నాడని అంటున్నారు. ఆమెను మరి ఆయన ఎలా మౌల్డ్ చేస్తాడో అని అంటున్నారు. ఇదిలా ఉంటే గతం లో  బాలయ్యతో బాపూ తీసిన శ్రీరామరాజ్యం మూవీ టైం లో కూడా ఇలాంటి విమర్శలే సీత పాత్రధారి నయనతార విషయంలో వచ్చాయని అంటున్నారు. కానీ ఆమె నటించి ఒప్పించి మెప్పించిందని అంటున్నారు. ఇపుడు కృతి కూడా తనదైన నటనతో అభినవ సీతగా రాణిస్తుందని కూడా మరి కొందరు అంటున్నారు. వేచి  చూడాలి మరి.