ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం డిసెంబర్ 10న

Andhra University Alumni Webinar on Dec 10

ప్రధాన అతిధిగా కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ 

విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ పూర్వవిద్యార్థుల సమ్మేళనం డిసెంబర్‌ 10న నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంలో ఎంతోమంది ప్రముఖులు హాజరై ఆంధ్ర యూనివర్సిటీ అలూమ్ని (ఎఎఎ) మరిన్ని కార్యక్రమాలను నిర్వహించాలని కోరినట్లుగా ఈ మధ్యకాలంలో ఎన్నో కార్యక్రమాలను చేసింది. మరోసారి వేవ్స్‌ 2020 కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని భావించినప్పటికీ కరోనా పరిస్థితుల కారణంగా దానిని వర్చువల్‌ పద్ధతిలో డిసెంబర్‌ 10వ తేదీన మధ్యాహ్నం 3.గంటలకు నిర్వహిస్తున్నట్లు ఎఎఎ ప్రధాన కార్యదర్శి బి. మోహన్‌ వెంకటరామ్‌ చెప్పారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా  కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ ప్రధాన అతిధిగా, ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్‌, ఎపిఎస్‌సిహెచ్‌ఇ చైర్మన్‌ డా. కె. హేమచంద్రారెడ్డి గెస్ట్‌ ఆఫ్‌ హానర్‌గా హాజరవుతారని చెప్పారు. ఎఎఎ ఫౌండర్‌ చైర్మన్‌ డా. జి.ఎం. రావు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారని, ఎఎఎ చైర్మన్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణ స్వాగతోపన్యాసం చేస్తారని తెలిపారు. వేవ్స్‌ 2020 కార్యక్రమంపై త్వరలోనే ఎఎఎ ఇసి మీటింగ్‌ ను జూమ్‌లో నిర్వహిస్తున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. 

సీఆర్‌ రెడ్డి, సర్వేపల్లి రాధాక ష్ణన్‌, వీఎస్‌ క ష్ణ వంటి గొప్ప వ్యక్తులు ఈ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్లుగా పని చేశారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న ఎంతోమంది ఈ యూనివర్సిటీలో విద్యను అభ్యసించినవారే.

గత నాలుగేళ్లలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను యూనివర్సిటీలో చేపట్టారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థులను కనెక్ట్‌చేసే బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు. ఈసారి కూడా విదేశాల్లో ఉన్న ఎన్నారైలను ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూసేందుకు కృషి చేస్తున్నట్లు మోహన్‌ వెంకట్‌రామ్‌ తెలిపారు. 94 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న ఈ యూనివర్సిటీ మరో ఆరేళ్ళలో శతవసంతోత్సవాలను కూడా జరుపుకుంటోందని ఈ సమయంలో ఎఎఎ ఆధ్వర్యంలో, ప్రముఖులు, సభ్యుల సహకారంతో ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆంధ్రయూనివర్సిటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు.