గ్రేటర్ ఓటర్లకు శుభవార్త

ghmc-elections-2020-ghmc-invite-new-app-voters

గ్రేటర్‍ ఓటర్‍లకు శుభవార్త. ఈ జీహెచ్‍ఎంసీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునే వారు తమ ఓటరు స్లీప్‍తో పాటు పోలీంగ్‍ బూత్‍ను అరచేతిలోనే తెలుసుకునేందుకు జీహెచ్‍ఎంసీ కొత్త యాప్‍ను రూపొందించింది. దీంతో మీ స్మార్ట్ ఫోన్ లోనే ఓటరు స్లీప్‍తో పాటు, పోలింగ్‍ కేంద్రం ఎక్కడుందో గూగుల్‍ మ్యాప్‍తో తెలుసుకునేందుకు జీహెచ్‍ఎంసీ ఓటర్ల కోసం మైజీమెచ్‍ఎంసీ యాప్‍ను ప్రత్యేకంగా రూపొందించింది. ఇప్పటికే నగరంలోని ఓటర్లకు ఓటరు స్లీప్‍ల పంపిణిని జీహెచ్‍ఎంసీ చేపట్టింది. అయితే, నగర ఓటర్లలో అధిక శాతం మందికి మొబైల్‍ ఫోన్‍లు ఉండడంతో అర చేతిలోనే ఓటరు పోలింగ్‍ బూత్‍, ఓటర్‍ స్లిప్‍ను డౌన్‍లోడ్‍ చేసుకునే విధంగా ఈ మొబైల్‍ యాప్‍ను రూపొందించింది. అయితే అది తెలుసుకోవాలంటే మీ ఆండ్రాయిడ్‍ మొబైల్‍ యాప్‍లో మైజీహెచ్‍ఎంసీ యాప్‍ను లౌన్‍లోడ్‍ చేసుకోవాలి.

యాప్‍లోకి వెళ్లి నో-యువర్‍ పోలింగ్‍ స్టేషన్‍ అప్షన్‍పై క్లిక్‍ చేసి ఓటరు పేరు, వార్డు పేరు ఎంటర్‍ చేస్తే ఓటరు స్లిప్‍తో పాటు పోలింగ్‍ బూత్‍ ఎక్కడుందో గూగుల్‍ మ్యాప్‍లో లొకేషన్‍ వస్తుంది. పేరుకు బదులుగా ఓటర్‍ గుర్తింపు కార్డు నెంబర్‍, వార్డు పేర్లు ఎంటర్‍ చేసినా ఓటర్‍ స్లిప్‍, పోలింగ్‍ కేంద్రం గూగుల్‍ మ్యాప్‍లో చూపిస్తుంది. ఈ నో-యువర్‍ పోలింగ్‍ స్టేషన్‍ యాప్‍పై చైతన్యం కలిగించేందుకు జీహెచ్‍ఎంసీ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. బస్‍ షెల్టర్‍లపైనా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం, ఎఫ్‍ఎం రేడియోలలో జింగిల్స్ ప్రసారం, టెలివిజన్‍ చానెళ్లలో స్క్రోలింగ్‍లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ యాప్‍పై స్థానిక కాలనీ సంక్షేమ సంఘాలకు వాట్సాప్‍ ద్వారా సమాచారం అందిస్తున్నారు.