2న బురేవి...5న టకేటి వచ్చే అవకాశం

two-more-cyclones-expected-december-meteorological-department

ఈనెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర వాయుగుండం కాస్తా తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. డిసెంబర్‍ నెలలో మరో రెండు తుపాన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. డిసెంబర్‍ 2న బురేవి తుపాను తీవ్ర ప్రభావం చూపనుందని, ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమపై దీని ప్రభావం ఎక్కువ చూపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్‍ 5న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో టకేటి తుపాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబరు 7న దక్షిణ తమిళనాడు, ఆంధప్రదేశ్‍ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.