అమితాబ్ రేఖలతో బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న మన 'మిథునం' సినిమా

Midhunam Movie will remake in hindi with bollywood Amitabh Bachchan

ఇటీవల  మన తెలుగు సినిమాలు హిందీలోకి రీమేక్ అవడం చూస్తూనే వున్నాం అయితే ఇక్కడ భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు బ్లాక్ బస్టర్ మూవీస్ కి మంచి డిమాండ్ వుంది. కానీ.....  అచ్చ తెలుగు సినిమా `మిథునం` ఒక చిన్న సినిమా ఇద్దరంటే ఇద్దరే నటించిన తక్కువ బడ్జెట్ మూవీ అయితేనేం! ప్రస్తుతం దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నటించిన ఈ  సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారట. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ పోషించనున్నారట. లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని విడిచి రెండు నెలలు గడిచిపోయినా ఆయన జ్ఞాపకాలు ఇప్పటికీ నెమరు వేసుకుంటున్నారు జనం. గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకుల మదిలో ముద్ర వేసిన ఆయన `మిథునం` సినిమాలో విలక్షణ పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. రెండే రెండు పాత్రలతో నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఈ సినిమాను రూపొందించారు. 

2012లో విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారట. బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా రీమేక్ హక్కులను దక్కించుకుందట. ఈ హిందీ రీమేక్‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. ఎస్పీ బాలు పోషించిన పాత్రలో నటించబోతున్నట్టు టాక్. అమితాబ్‌కు జంటగా ఒకనాటి అందాల తార రేఖ నటించనున్నారని తెలుస్తోంది. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఈ మూవీ తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేయబోయేది ఎవరు? ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది అధికారిక వస్తేనే క్లారిటీ వస్తుంది.