సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే

YS Jagan Mohan to conduct an aerial survey of Cyclone Nivar effected areas

నివర్‍ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న మూడు జిల్లాల్లో ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍మోహన్‍ రెడ్డి ఏరియల్‍ సర్వే నిర్వహించారు. తాడేపల్లి నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ గన్నవరం విమానశ్రయం నుంచి నేరుగా చిత్తూరు జిల్లాకు వచ్చారు. అక్కడి నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని ఏరియల్‍ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్సార్‍, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరద ప్రభావంపై సమీక్ష చేపట్టారు. అనంతరం సీఎం తాడేపల్లికి తిరిగి పయనమయ్యారు. కాగా, తుపాను ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాలు వర్షంతో తడిసి ముద్దయ్యాయి.