ఏపీ ప్రభుత్వం నిర్ణయం పట్ల ఎస్పీ చరణ్ హర్షం

Singer SP Charan thanks to YS Jagan

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలోని నెల్లూరులోని మ్యూజిక్‍, డ్యాన్స్ ప్రభుత్వ పాఠశాలకు డాక్టర్‍ ఎస్పీ బాలసుబ్రహ్మణ్య పేరు పెట్టడం పట్ల ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‍ హర్షం వ్యక్తం చేశారు. తన తండ్రికి దక్కిన గొప్ప గౌరవమని, ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍మోహన్‍రెడ్డి, ఏపీ ప్రభుత్వానికి ట్విటర్‍ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. కాగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాలకు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును చేరుస్తూ ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‍ రెడ్డి ట్వీట్‍ చేశారు.