
అమెరికా వ్యాప్తంగా దాదాపు 90 వేల మంది కొవిడ్ రోగులు ఆస్పత్రుల్లో చేరారని కొవిడ్ ట్రాకింగ్ ప్రాజెక్టు వర్గాలు తెలిపాయి. వరుసగా 16వ రోజు ఇదొక కొత్త రికార్డు అని పేర్కొన్నాయి. మృతుల సంఖ్య 2,284కి చేరుకోగా, మే 7 తర్వాత ఇదే అధికమని తెలిపారు. వచ్చే నాలుగు వారాల్లో ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం (సిడిఎస్) తెలిపింది. డిసెంబరు 19తో ముగిసే వారంలో 10,600 నుండి 21,400 మధ్యలో కొత్త మృతులు వుండవచ్చని పేర్కొంది. డిసెంబరు 19 నాటికి మొత్తంగా మృతుల సంఖ్య 2,94,000 నుండి 3,21,000 మధ్యలో వుండవచ్చని సిడిఎస్ అంచనా వేసింది. రాష్ట్రాలవ్యాప్తంగా 50 శాతం కేసులు పెరిగాయి.