ఇలా అయితే రూల్ ఆఫ్ లా ఎలా ?

ap high court serious on ap police department due to sc st atrocity act against sc farmers

రాజధానిలో ఎస్సీ రైతులపై ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రయోగిస్తారా? 18 రోజులు నిర్బంధిస్తారా.. ఇలా అయితే రూల్‍ ఆఫ్‍ లా ఎలా అమలు చేస్తారని హైకోర్టు ఆంధప్రదేశ్‍ రాష్ట్ర పోలీస్‍శాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేస్తే రైతుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించటమేనని న్యాయస్థానం సృష్టం చేసింది. రైతుల తరుపున న్యాయవాది ఇంద్రనీల్‍బాబు వాదనలు వినిపించారు. రైతులను అరెస్ట్ చేసేందుకు సరైన కారణాలు ఎందుకు చూపలేదంటూ న్యాయవాది వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. ఇది ధిక్కరణగా నిర్ణయించే అధికారం కోర్టుకు ఉందని పేర్కొంది. పౌరులు, ప్రజలు, అధికారులు రాజ్యాంగ ప్రకారమే నడుచుకోవాలని అక్రమ కేసులు బనాయిస్తే ప్రజలు ఎక్కడికెళతారని పోలీసుల తీరును తప్పుపట్టింది. పోలీసుల  దాఖలు చేసిన రిపోర్టు కూడా సక్రమంగా లేదని అసహనం వ్యక్తం చేసింది.

 


                    Advertise with us !!!