
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ పార్టీకి, ఎన్నికల్లో పోటీ చేసే ఏ అభ్యర్థికి మద్దతు తెలపడం లేదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని గతంలో తెలియజేసినట్టు ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఎవరికి ఓటు వేస్తే డివిజన్లలో అభివృద్ధి చేస్తారో వారికే ఓటు వేయాలని జీహెచ్ఎంసీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులకు ఆయన సూచించారు.