బీజేపీలోకి గూడూరు నారాయణరెడ్డి ?

Telangana Congress treasurer Narayana Reddy set to join BJP

కాంగ్రెస్‍ పార్టీతో గత 39 ఏళ్లుగా ఉన్న అనుబంధాన్ని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి వదులుకోనున్నారు. పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. గూడూరు వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే బీజేపీ గూటికి గూడూరు చేరేందుకు అంతా సిద్ధమైందన్న ప్రచారమూ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్‍ పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఒకటి, రెండు రోజుల్లో కాంగ్రెస్‍ పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.

 


                    Advertise with us !!!