నా విజన్ నిజమైనందుకు గర్వంగా ఉంది : చంద్రబాబు

Chandrababu Naidu About Bharat Biotech

హైదరాబాద్‍ను బయోటెక్‍ కేంద్రంగా మలచాలని మూడు దశాబ్దాల కిందట జెనోమ్‍ వ్యాలీకి అంకురార్పణ చేశా. నా విజన్‍ నిజమైనందుకు గర్వంగా ఉంది. ప్రధాని వచ్చి భారత్‍ బయోటెక్‍ వ్యాక్సిన్‍ ఏ దశలో ఉందో సమీక్షించడం ఆనందించే విషయం అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్‍లోని జెనోమ్‍ వ్యాలీలోని భారత్‍ బయోటెక్‍ వ్యాక్సిన్‍ కేంద్రాన్ని సందర్శించనున్న నేపథ్యంలో ఆయన ట్వీట్‍ చేశారు. అన్ని అవరోధాలు అధిగమించి భారత్‍ బయోటెక్‍ కంపెనీ వ్యాక్సిన్‍ను అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తుందని ఆకాంక్షించారు.