
ముంబై ఉగ్రదాడికి (26/11) మాస్టర్‌మైండ్, లష్కరే తాయిబాకు చెందిన సాజిద్ మీర్ అరెస్ట్ కు లేదా దోషిగా నిర్ధారించే సమాచారం అందించిన వారికి 50 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో రూ.37 కోట్లు) రికార్డును అమెరికా ప్రకటించింది. మరణించిన 166 మందిలో పలువురు అమెరికన్లు ఉన్నారు. దీంతో సాజిద్‌పై 2011లో ఆ దేశ కోర్టులో కేసు నమోదైంది. 2019లో ఎఫ్‌బీఐ మోస్ట్ వాటెండ్ ఉగ్రవాదుల జాబితాలో అతడి పేరును కూడా చేర్చారు.