ఎంత బడ్జెట్ అయినా పరవాలేదు బ్లాక్ బస్టర్ హిట్ తీయాలి : రాజమౌళిని కోరిన కె యల్ నారాయణ

Mahesh Babu and SS Rajamouli s film to go on floors after RRR Movie

సూపర్ స్టార్ మహేష్ బాబు తో రాజమౌళి ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్ నారాయణ నిర్మాతగా ఎంతో భారీ లెవెల్లో గ్రాండ్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన బాధ్యతలు అన్నీ కూడా నిర్మాత నారాయణ దర్శకుడు రాజమౌళి పైన పెట్టారని అంటున్నారు. కేవలం కథాకథనాలు మాత్రమే కాక సినిమాకు సంబంధించిన బడ్జెట్ విషయాలు కూడా రాజమౌళి ని చూసుకోమని ఖర్చు ఎంత అయినా పర్లేదు గాని సినిమా ఎట్టిపరిస్థితుల్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ కావాలని రాజమౌళిని ఆయన కోరినట్లు చెబుతున్నారు. ఇక మరోవైపు తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించి ఒక పవర్ఫుల్ స్టోరీ సిద్ధం చేయిస్తున్న రాజమౌళి తొలిసారిగా సూపర్ స్టార్ తో సినిమా తీస్తుండడంతో దానికోసం కొన్ని వందల కోట్ల రూపాయల బడ్జెట్ ని కూడా కేటాయించనున్నట్లు చెబుతున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు గానీ ఈ సినిమా కనుక తెరకెక్కి రేపు రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధిస్తే అటు రాజమౌళితో పాటు ఇటు మహేష్ బాబు కెరీర్లో కూడా ఇది అత్యద్భుత సినిమాగా నిలిచే అవకాశం గట్టిగా కనపడుతుంది.....!!

ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్. మెగా, నందమూరి హీరోలు అయిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తుండగా ప్రఖ్యాత సంగీత దర్శకుడు కీరవాణి దీనికి మ్యూజిక్ ని అందిస్తున్నారు. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు ఇద్దరు హీరోల యొక్క పరిచయ టీజర్లు ఇటీవల ప్రేక్షక అభిమానుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఇప్పటికే 85 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభమైంది. ఇక దీని బ్యాలన్స్ షూటింగ్ ని వీలైనంత వేగవంతంగా పూర్తి చేసి ఎట్టిపరిస్థితుల్లో మూవీని వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ చేసేలా మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.