అమెరికాలో 'సర్కారు వారి పాట' పాడనున్న మహేష్ బాబు: 2021 సమ్మర్ స్పెషల్ గా ప్లానింగ్

Mahesh Babu is going to sing a song in Sarkaru Vaari Paata Movie

సూపర్ స్టార్  మహేష్ బాబు, పరశురామ్ ల కలయికలో తెరకెక్కనున్న సర్కారు వారి పాట సినిమా వాస్తవానికి ఈ ఏడాది ప్రథమార్థంలోనే సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. అయితే ఒక్కసారిగా కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించటం సినిమా షూటింగ్స్ అన్ని రద్దు అవడంతో ఈ సర్కారు వారి పాట కూడా ఆగిపోయింది. ఇక ఇటీవల ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని అమెరికాలో ప్లాన్ చేసిన మూవీ యూనిట్ అక్కడికి వెళ్లాలని నిశ్చయించింది. అయితే అదే సమయంలో అక్కడ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండటంతో మరొక నెలన్నర పాటు దానిని వాయిదా వేశారు. అందుతున్న సమాచారాన్ని బట్టి జనవరి ఏడో తారీఖు నుంచి ఈ సినిమా పక్కాగా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించి మూవీ యూనిట్ పూర్తిగా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మహేష్ బాబు ఇప్పటి వరకు చేయని ఒక విభిన్నమైన పాత్ర ఈ సినిమాలో చేస్తున్నట్లు సమాచారం. ఇక తొలిసారిగా సూపర్ స్టార్ కు జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ కి చెందిన పలువురు దిగ్గజ నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లు చెప్తున్నారు. 

బ్యాంకు కుంభకోణాలు, మోసాల ఇతివృత్తంతో మహేష్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా పక్కాగా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు పరశురామ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఐదు అద్భుతమైన ట్యూన్స్ సిద్ధం చేశాడని అలాగే సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మరో రేంజిలో ఉండనుందని టాక్. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ కోసం ఇప్పటికే రెడీ అవుతున్న మహేష్ బాబు, హెయిర్ స్టైల్ సహా తన పూర్తి మేకోవర్ ని మార్పు చేశారు.

ఇక అందుతున్న సమాచారాన్ని బట్టి మహేష్ సహా ఆయన ఫ్యామిలీ మొత్తం జనవరి రెండో తేదీన అమెరికాకు వెళ్లనుందని ఆ తర్వాత మొదటి వారం నుండి ప్రారంభమయ్యే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా మార్చి నెల మధ్య వరకు నిర్విరామంగా అక్కడే కొనసాగుతుందని అంటున్నారు. దానితో సినిమా 80 శాతం వరకు పూర్తవుతుందని, అనంతరం ఇండియాకి తిరిగి వచ్చిన యూనిట్ మిగతా భాగాన్ని హైదరాబాదులో పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవిలో దీన్ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. మ'రి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమైతే ఇది నిజంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి పండుగ వార్త అని చెప్పక తప్పదు.....!!

 


                    Advertise with us !!!