
ప్రధాని నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్లో పర్యటించనున్నారు. నగరానికి చెందిన భారత్బయోటెక్ సంస్థ..కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ నియంత్రణ కోసం భారత్ స్వదేశీయంగా తయారు చేస్తున్న మొట్టమొదటి వ్యాక్సిన్ కోవాగ్జిన్. అయితే ప్రధాని నరేంద్ర మోదీ రేపు సాయంత్రం 3:40 నిమిషాలకు హైదరాబాద్లో ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సిటీ పోలీసు కమిషనర్ వీసీ స్జనార్ తెలిపారు. భారత్బయోటెక్ సంస్థను సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ప్రధాని మోదీ విజిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం 5:40 నిమిషాలకు ప్రధాని మళ్లీ తిరుగు ప్రయాణం అవుతారని తెలుస్తోంది.