శ్రీవారి ఆలయంలో వైభవంగా కైకిక ద్వాదశి ఆస్థానం

Kaisika Dwadasi Asthanam In Tirumala

తిరుమలలో కైకిక ద్వాదశి ఆస్థానంను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వైభవంగా నిర్వహించింది. శ్రీవారి ఆలయంలో స్నపనబేరంగా పిలువబడే ఉగ్ర శ్రీనివాసమూర్తి సమేత శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు తిరుచ్చి ఉత్సవాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం బంగారు వాకిలిచెంత ఆస్థానంను అర్చకులు వేడుకగా నిర్వహించారు. కైకిక ద్వాదశి ఆస్థానాన్ని పురాణపారాయణం ద్వారా అర్చకులు శాస్త్రోక్తంగా చేపట్టారు. ఏడాదిలో కైకిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు ఉగ్రశ్రీనివాసమూర్తికి ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీ. నివర్‍ తుపాను ప్రభావంతో ఆలయంలోనే ఏకాంతంగా వేకువజామున నాలుగున్నర నుంచి ఐదున్నర గంటల మధ్య ఉత్సవాన్ని టీటీడీ నిర్వహించింది.